SSC Recruitment: నిరుద్యోగులకు అలర్ట్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో జాబ్ నోటిఫికేషన్
SSC Recruitment: నిరుద్యోగులకు అలర్ట్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో జాబ్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC ) సెంట్రల్ గవర్నమెంట్‌కు చెందిన వివిధ డిపార్ట్‌మెంట్లలో క్లర్క్ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) భర్తీ చేస్తుంది. తాజాగా ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ అండ్ హవల్దార్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1198 నాన్ టెక్నికల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్ట్ లను, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (CBN) ల్లో 360 హవల్దార్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. సీబీఎన్ లో ఎంటీఎస్ పోస్ట్ లకు 18 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వారు, సీబీఐసీ లో హవల్దార్ పోస్ట్ లకు 18 నుంచి 27 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.