గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం!
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం! తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, హైదరాబాద్ 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్- సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మార్చి-2023లో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. స్క్రీనింగ్ టెస్ట్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు. వివరాలు.. * తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. సీట్లు: 3680(బాలురు- 1680; బాలికలు- 20...