పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి మరో అవకాశం..

 

PAN-Aadhaar Link: పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి మరో అవకాశం.. గడువు తేదీని పొడిగించిన కేంద్రం.. ఎప్పటివరకంటే..


మీ పాన్ కార్డ్‌ని మీ ఆధార్ కార్డ్‌తో లింక్ చేశారా..? ప్రతి భారతీయ పౌరుడు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఇది. ఇప్పుడు పాన్ కార్డ్- ఆధార్ కార్డ్ లింక్ చేసే తేదీని ప్రభుత్వం పొడిగించింది. దేశంలో ముఖ్యమైన పత్రాల్లో ఒకటైన ఆధార్‌. ఇక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించి, అలాగే బ్యాంకు లావాదేవీల్లో ముఖ్యమైన పత్రాల్లో పాన్‌ కార్డు. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు విషయంలో నిబంధనలు..
పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు 30 జూన్ 2023 నాటికి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. 30 జూన్ 2023 నాటికి ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌తో లింక్ చేయవచ్చు.ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడం తప్పనిసరి అని కేంద్రం పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి తేదీ 31 మార్చి 2023.. అయితే ఇప్పుడు దానిని జూన్ 30కి పెంచారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని గతంలో చాలాసార్లు పొడిగించారు.





Comments

Popular posts from this blog

డిగ్రీ అర్హతతో 14,582 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం.!

RRB Group D Admit Card 2025 Link