7500 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు.....
SSC CGL Notification 2023: 7500 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్ - బి , గ్రూప్ - సి పోస్టుల భర్తీకి నిర్వహించే ' కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ -2023' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది . ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు . పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది . ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల ( టైర్ -1, టైర్ -2 ) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు . పోస్టుల వివరాలు .. ఖాళీల సంఖ్య: 7,500 ➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ➥ అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్ ➥ ఇన్‌స్పెక్టర్ - సెంట్రల్ ఎక్సైజ్ ➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్) ➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్) ➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ➥ సబ్ ఇన్‌స్ప...