RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఇప్పుడు ఎలా మార్చుకోవాలి?
RBI: రూ.2000 నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఇప్పుడు ఎలా మార్చుకోవాలి?
RBI: రూ.2000 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటి నుంచే రూ.2 వేల నోట్లను ఇవ్వటం ఆపేయాలని దేశంలోని బ్యాంకులకు సూచనలు చేసింది. అయితే, ఈ పెద్ద నోట్లు చెల్లుతాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే, ప్రస్తుతానికి రూ.2 వేల నోటు లావాదేవీలకు వినియోగించుకోవచ్చని తెలిపింది.
రూ.2 వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేసి వాటికి సమానమైన విలువ కలిగిన ఇతర నోట్లను తీసుకోచవచ్చని తెలిపింది. మే 23, 2023 నుంచి ఏ బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి అయినా ఈ నోట్లను మార్చుకోవచ్చు. అలాగే దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అకౌంట్లో డిపాజిట్ చేసేందుకు ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు లేవు. అయితే, బ్యాంక్ సేవలకు అంతరాయం కలగకుండా ఒకసారి రూ.20,000 వరకు మాత్రమే ఈ పెద్ద నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.



Comments
Post a Comment