TS CPGET-2023-24 | పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు.. సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

 


TS CPGET-2023-24 | పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు.. సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
TS CPGET-2023-24 | తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS CPGET) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆర్ లింబాద్రి సోమవారం విడుద‌ల చేశారు. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూహెచ్, మహిళా యూనివర్సిటీల్లో సీపీగెట్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.


ఈ నెల 12 నుంచి జూన్‌ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.500 ఆలస్య రుసుముతో జూన్‌ 18 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో జూన్‌ 20 వరకు ఫీజు చెల్లించవచ్చని సీపీగెట్‌ కన్వీనర్‌ తెలిపారు. సీపీగెట్‌ పరీక్ష జూన్‌ ఆఖరివారంలో జరుగనున్నది. ఈ యూనివర్సిటీల్లోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర వంటి సంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలను సీపీగెట్‌తో భర్తీ చేయనున్నది.



Comments

Popular posts from this blog

డిగ్రీ అర్హతతో 14,582 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.. ఎంపికైతే నెలకు రూ.లక్షన్నర జీతం.!

RRB Group D Admit Card 2025 Link