Telangana: కులవృత్తులు, చేతి వృత్తుల వారికి రూ.1లక్ష ఆర్థిక సాయం, దరఖాస్తులు ప్రారంభం

 

Telangana: కులవృత్తులు, చేతి వృత్తుల వారికి రూ.1లక్ష ఆర్థిక సాయం, దరఖాస్తులు ప్రారంభం 

Application Form for Financial Assistance for OBC Communities: బీసీ కులవృత్తులు, చేతి వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.



ష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీసీ కులవృత్తులు, చేతి వృత్తులకు లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తామని ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోగా.. దరఖాస్తులు ప్రారంభించింది సర్కార్. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వారికి ఆర్థికసాయం పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీన సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఆ రోజు మంచిర్యాలలో సీఎం కేసీఆర్ బీసీ కులవృత్తులకు ఆర్థికసాయాన్ని లాంఛనంగా అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కులవృత్తులు చేసుకునే లబ్దిదారులకు ఆర్థికసాయం పంపిణీ చేస్తారు.



జూన్ 6 నుంచి 20 వరకు

ఈనెల 6 నుంచి 20 తేదీ వరకూ ................ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఫోటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం వివరాలతో సరళంగా అప్లికేషన్ ఫారమ్ రూపొందించామన్న మంత్రి... వచ్చిన ధరఖాస్తులను జిల్లా యంత్రాంగంతో పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. చేతి వృత్తిదారుల జీవితాలలో వెలుగులు నింపి, వారి ఆర్థిక భరోసాను అందించడంతో పాటు గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం తపన పడుతుంటారని, ఈ పథకం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఏర్పడుతుందన్నారు. లబ్దిదారులు వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయన్నారు.



దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో అప్లికేషన్ ను వెంటనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. కృలవృత్తి, చేతివృత్తులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు సాయం



Comments

Popular posts from this blog

ఇండియా పోస్ట్‌ GDS 2025 నోటిఫికేషన్‌ విడుదల

RRB Group D Admit Card 2025 Link