7547 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

 

7547 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 1న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..


* కానిస్టేబుల్ పోస్టులు

1) కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302.

2)  కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150



అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌(ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలలి. అభ్యర్థులు 02.07.1998 - 01.07.2005 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, స్పోర్ట్స్ పర్సన్స్‌కు 5 సంవత్సరాలు, స్పోర్ట్స్ పర్సన్స్‌(ఎస్సీ, ఎస్టీ)లకు 10 సంవత్సరాలు, ఢిల్లీ పోలీసు డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు- 40 నుంచి 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్, ఇతర అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.   


Comments

Popular posts from this blog

ఇండియా పోస్ట్‌ GDS 2025 నోటిఫికేషన్‌ విడుదల

RRB Group D Admit Card 2025 Link