SBI: డిగ్రీ అర్హతతో 8,424 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల..
SBI: డిగ్రీ అర్హతతో 8,424 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల..
SBI Clerk Jobs 2023 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న
నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
SBI Clerk Notification 2023 : దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8773 క్లర్క్ (Junior Associate) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక.. అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
మొత్తం క్లర్క్ పోస్టులు - 8773
- విద్యార్థత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనలియర్ విద్యార్థులు కూడా అర్హులే.
- వయసు: అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం : ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేపడతారు.
- దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభతేదీ: నవంబర్ 17, 2023
- దరఖాస్తులకు చివరితేదీ : డిసెంబర్ 7, 2023




Comments
Post a Comment