TS EAMCET Counselling Dates 2024 : తెలంగాణ ఈఏపీసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..
తెలంగాణ ఈఏపీసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..
TS EAPCET EAMCET Counselling Schedule 2024 : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ (TS EAPCET 2024) ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ అధికారులు TS EAPCET EAMCET 2024 Counselling షెడ్యూల్ విడుదల చేశారు.
తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఈరోజు (మే 24) విడుదల చేసింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. జూన్ 27వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 30వ తేదీ నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జులై 12వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనుంది. జులై 19వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్.. జులై 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్.. ఆగస్టు 5వ తేదీనన సీట్లను కేటాయించనున్నారు.
TS EAPCET ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2024
- జూన్ 27 - ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం
- జూన్ 30 - ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు
- జులై 12 - ఫస్ట్ ఫేజ్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
- జులై 19 - ఇంజినీరింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం
- జులై 24 - సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు
- జులై 30 - ఇంజినీరింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్
- ఆగస్టు 5 - ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు
- ఆగస్టు 17 - స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదల
ఇక.. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఆగస్టు 17వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేస్తారు. విద్యార్థులు రిపోర్టింగ్ చేసే సంఖ్యను బట్టి మిగిలే సీట్ల విషయంలో క్లారిటీ వస్తుంది. త్వరలోనే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.




Comments
Post a Comment