గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు.. నోటిఫికేషన్‌ విడుదల

 గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు.. 



Telangana Gurukulam 5th Class Admission 2025 : తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS విద్యాసంస్థల ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాలకై ఉమ్మడి ప్రవేశ పరీక్ష (Telangana Gurukul (VTG) CET - 2025) ప్రకటన విడుదల చేశారు.



తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్లను ధీటుగా ఎదుర్కోవటానికి సిద్ధం చేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం బోధనతో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం 2025 ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని అన్నీ జిల్లాల్లో TG Gurukul CET 2025 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


ఇతర ముఖ్యమైన సమాచారం :

  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : డిసెంబర్‌ 21, 2024
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 1, 2025
  • దరఖాస్తు ఫీజు : రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒక ఫోన్ నెంబర్‌ సాయంతో ఒక దరఖాస్తు మాత్రమే చేయవచ్చు.
  • అభ్యర్థికి బదులుగా వేరే వారి ఫోటోలు పెట్టి దరఖాస్తు చేస్తే అలాంటి వారిపై సెక్షన్ 416 ఆఫ్ IPC 1860 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
  • విద్యార్థుల ఎంపిక విషయంలో ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.
  • విద్యార్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో నాలుగో తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.
  • వయస్సు: ఓసీ, బీసీ, బీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య.. ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతం అయితే రూ.1.50,000.. అదే పట్టణ ప్రాంతం అయితే.. రూ.2,00,000 మించకూడదు.


  • ప్రవేశ పరీక్ష విధానం: ఈ ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుంది. తెలుగు (20 మార్కులు), ఇంగ్లిష్ (25 మార్కులు), గణితం (25 మార్కులు), మెంటల్‌ ఎబిలిటీ (10 మార్కులు), పరిసరాల విజ్ఞానం (20 మార్కులు) ఉంటుంది. ఆయా సబ్జెక్టులో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.

Comments

Popular posts from this blog

ఇండియా పోస్ట్‌ GDS 2025 నోటిఫికేషన్‌ విడుదల

RRB Group D Admit Card 2025 Link