SBI Clerk Notification 2024: డిగ్రీ అర్హతతో 13,735 జూనియర్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు.. భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 13,735 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెక్రూట్‌మెంట్‌ ద్వారా జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ విభాగంలో భర్తీ చేయనుంది. 




పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

SBI నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 13,735 క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.



ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోపు దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 17th డిసెంబర్ 2024

అప్లికేషన్ ఆఖరు తేదీ : 7th జనవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

29 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాల వయస్సు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.



సెలక్షన్ ప్రాసెస్:

SBI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ రాత పరీక్ష, మార్చి లేదా ఏప్రిల్ లో మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, Gk వంటి సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. 1/4th నెగటివ్ మార్క్స్ ఉంటాయి.



శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావున TA, DA, HRA వంతు అన్ని రకాల వసతులు కల్పిస్తారు

sourec  https://www.freejobsintelugu.com/2024/12/16/sbi-clerk-notification-2024/

Comments

Popular posts from this blog

ఇండియా పోస్ట్‌ GDS 2025 నోటిఫికేషన్‌ విడుదల

RRB Group D Admit Card 2025 Link