RRB | ఐటీఐ అర్హతతో.. రైల్వేలో 9970 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
RRB | ఐటీఐ అర్హతతో.. రైల్వేలో 9970 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
RRB | రైల్వే( RRB )లో జాబ్ చేయాలనుకుంటున్నారా..? అది కూడా లోకో పైలట్( Loco Pilot )గా అనుకుంటున్నారా..? ఇంకేందుకు ఆలస్యం.. మీరు ఐటీఐ( ITI ), డిప్లొమా( Diploma ) చేసి ఉంటే చాలు.. దరఖాస్తు చేసుకోవడమే.
RRB | నిరుద్యోగులకు శుభవార్త. పదో తరగతి తర్వాత ఐటీఐ( ITI ), డిప్లొమా( Diploma ) చేసిన విద్యార్థులకు ఇదో సువర్ణ అవకాశం. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో( Railway Regions ) అసిస్టెంట్ లోకో పైలట్(Assistant Loco Pilot )) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు( RRB ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9970 పోస్టులను భర్తీ చేయనుంది. అత్యధికంగా సికింద్రాబాద్ రీజియన్( Secunderabad Region ) లో 1500 ఖాళీలు, రాంచీ రీజియన్( Ranchi Region )లో 1213 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్( ALP ) ఉద్యోగం పొందిన వారికి లెవల్ -2 ప్రకారం ప్రారంభ వేతనం రూ. 19,900 ఇవ్వనున్నారు.
అర్హతలు..
పదో తరగతి లేదా ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మెకానికల్ /ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్/ ఆటో మొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ నాలుగు బ్రాంచీల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు..
2025 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
చివరి తేదీ : మే 11



Comments
Post a Comment