మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణలో రెండు కొత్త పథకాలు

 తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ రెండు కొత్త పథకాలు ప్రారంభించింది. మైనారిటీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త పథకాలు ఉద్దేశించారు. 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన' పేరుతో.. ఒంటరి మహిళలు, వితంతువులకు రూ.50వేలు ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందిస్తారు.



ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన: ఈ పథకం కింద వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథలు, అవివాహిత మహిళలకు రూ. 50,000 సహాయం అందిస్తారు. వారు చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, స్వయం ఉపాధి కల్పించుకోడానికి ఇది ఉపయోగపడుతుంది.

రేవంత్ అన్న కా సహారా': ఈ పథకం కింద, ఫకీర్, దూదేకుల వర్గాలకు రూ. 1 లక్ష సహాయం అందిస్తారు. వాళ్లు మోపెడ్స్ (ద్విచక్ర వాహనాలు) కొనుగోలుకు సాయం అందిస్తారు. ఫలితంగా వారు తమ జీవనోపాధిని మెరుగుపర్చుకోవడానికి ఈ పథకం సహాయపడుతుంది.



ఈ పథకాలకు రూ.30కోట్లు నిధులు కేటాయించారు. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19, 2025 నుంచి అక్టోబర్ 6, 2025 వరకు జరుగుతుంది.

Comments

Popular posts from this blog

ఇండియా పోస్ట్‌ GDS 2025 నోటిఫికేషన్‌ విడుదల

RRB Group D Admit Card 2025 Link