TGSRTC ఆర్టీసీలో 1,743 ఉద్యోగాలు
ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,743 కాగా.. ఇందులో డ్రైవర్ కొలువులు 1,000, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. అక్టో బరు 8వ తేదీ నుంచి 28 వరకు
◆ డ్రైవర్ పోస్టులకు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు.. శ్రామిక్ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ఐదేళ్లు.. ఎక్స్ సర్వీస్మెన్కు మూడేళ్ల వయోపరిమితి సడ లింపు ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్, మెడి కల్, డ్రైవింగ్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
◆ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇతరులకు రూ.600. శ్రామిక్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 200, 2 . 400. ●శ్రామిక్ పోస్టులకు ఐటీఐ పాసై ఉండాలి. ◆ డ్రైవర్ కొలువులకు కనీస విద్యార్హత పదో తరగతి.. దీంతోపాటు నోటిఫికేషన్ తేదీ నాటికి 18 నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్ మోటారు వెహికిల్ లేదా హెవీ గూడ్స్ వెహికిల్ లేదా రవాణా వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవర్ ఉద్యోగా లకు రూ.20,960-60,080, శ్రామిక్ పోస్టులకు రూ. 16,550-45,030 పేస్కేల్ ఉంటుంది. శ్రామిక్ పోస్టుల్లో అత్యధికంగా మెకానిక్(డీజిల్, మోటార్ వెహికిల్) 589 పోస్టులున్నాయి.
డ్రైవర్ కొలువుల్లో అత్యధికం హైదరాబాద్లో
డ్రైవర్ పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 148 భర్తీ చేస్తారు. తర్వాత మేడ్చల్లో 93, రంగారెడ్డిలో 88 ఉన్నాయి. ఇతర జిల్లాల్లో.. సంగారెడ్డిలో 59, వికారాబాద్లో 34, జనగామలో 21, మహబూబాబాద్ 31, హను మకొండలో 41, వరంగల్లో 29, యాదాద్రిలో 15, సూర్యాపేటలో 22, నల్గొండలో 31, నారాయణపే టలో 13, వనపర్తిలో 13, గద్వాలలో 13, నాగర్క ర్నూల్లో 20, మహబూబ్నగర్లో 20, కొత్తగూ డెంలో 34, ఖమ్మంలో 44, కామారెడ్డిలో 30, నిజా మాబాద్లో 49, సిద్దిపేటలో 13, మెదక్ 10, ములుగులో 3, భూపాలపల్లిలో 5, సిరిసిల్లలో 7, జగిత్యాలలో 11, పెద్దపల్లిలో 10, కరీంనగర్లో 12, ఆసిఫాబాద్ 15, నిర్మల్లో 21, మంచిర్యాలలో 24, ఆదిలాబాద్ జిల్లాలో 21 పోస్టులు ఉన్నాయి


Comments
Post a Comment