భారత సైన్యంలో కొలువుల జాతర.. 25,000కుపైగా పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల
భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే..
విభాగాల వారీగా పూర్తి విద్యార్హతలు ఈ నోటిఫికేషన్‌లో ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారి వరకు అందరికీ అవకాశాలు ఉన్నాయి:
అగ్నివీర్ (జనరల్ డ్యూటీ - GD): 10వ తరగతిలో కనీసం 45% మార్కులు సాధించి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33% మార్కులు తప్పనిసరి.
అగ్నివీర్ (టెక్నికల్): ఇంటర్మీడియట్ (MPC) లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
అగ్నివీర్ (క్లర్క్ / స్టోర్ కీపర్): ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, కానీ కనీసం 60% మార్కులు ఉండాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్/అకౌంట్స్ సబ్జెక్టులు కలిగి ఉండాలి.
అగ్నివీర్ (ట్రేడ్స్‌మెన్): 8వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు. సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్: ఇంటర్ (BiPC) లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు ఇంగ్లీష్ ఉండాలి.
సోల్జర్ ఫార్మా: ఇంటర్మీడియట్‌తో పాటు ఫార్మసీలో డిప్లొమా (D.Pharma) లేదా డిగ్రీ (B.Pharma) పూర్తి చేసి ఉండాలి.
వయస్సు మరియు శారీరక ప్రమాణాలు వయోపరిమితి: సాధారణంగా 17 ½ ఏళ్ల నుండి 21 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. (నర్సింగ్ అసిస్టెంట్ మరియు ఫార్మా పోస్టులకు గరిష్ట వయస్సు 23 ఏళ్ల వరకు ఉండవచ్చు).
శారీరక సామర్థ్యం: అభ్యర్థులు నిర్దేశించిన ఎత్తు, బరువు మరియు ఛాతీ కొలతలు కలిగి ఉండాలి. రాష్ట్రం మరియు ప్రాంతాన్ని బట్టి ఈ కొలతల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
చివరి తేదీ ;- 01-04-2026
.jpeg)


Comments
Post a Comment