గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల
గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లు.. Telangana Gurukulam 5th Class Admission 2025 : తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS, TGREIS విద్యాసంస్థల ఆధ్వర్యంలో 5వ తరగతిలో ప్రవేశాలకై ఉమ్మడి ప్రవేశ పరీక్ష (Telangana Gurukul (VTG) CET - 2025) ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్లను ధీటుగా ఎదుర్కోవటానికి సిద్ధం చేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం బోధనతో విజయవంతంగా నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలల్లో 5వ త...